Bitcoin అనేది ఒక డిజిటల్ కరెన్సీ (Cryptocurrency). ఇది Blockchain టెక్నాలజీ పై ఆధారపడి పనిచేస్తుంది. ఇది ఏదైనా దేశానికి గాని సంస్థకు గాని చెందినది కాదు . ఇది ఎవరి కంట్రోల్ లో ఉండదు కాబట్టి దీనిని Decentralized Currency అంటారు. Bitcoin కు ఫిజికల్ రూపం అంటూ ఉండదు. దీనిని Digital Gold గా పిలుస్తారు. ఒక Bitcoin అంటే 10 కోట్ల Satoshi’s కు సమానం. బిట్ కాయిన్స్ ని మైనింగ్ ద్వారా సృష్టిస్తారు .కేవలం 2 కోట్ల 10 లక్షలు మాత్రమే ఉంటాయి. అంతకుమించి Bitcoins ను సృష్టించడం కుదరదు.
1.Bitcoin ను ఎవరు కనుగొన్నారు?
Bitcoin ని మొదటిసారిగా అక్టోబర్ 31 , 2008 సంవత్సరంలో Satoshi Nakamoto అనే వ్యక్తి లేక సమూహం సృష్టించటం జరిగింది . “Bitcoin : A Peer-to-Peer Electronic Cash System” అనే ఒక White Paper ప్రచురించటం జరిగింది . Satoshi Nakamoto అనేది వ్యక్త లేక ఒక సంస్థ అనేది ఇప్పటివరకు తెలియదు . ఈ వైట్ పేపర్ లో Bitcoin కు సంబంధించిన అన్ని “Set of Rules ” ని క్లియర్ గా ప్రకటించటం జరిగింది . జనవరి 03 , 2009 న మొదటి Block (Genesis Block) ని Mining చేయటం జరిగింది . ఇప్పటివరకు దాదాపు 1M Blocks మైనింగ్ చేయటం జరిగింది .ప్రతి 10 నిముషాలకు ఒక Block ని మైనింగ్ చేయటం జరుగుతుంది . 2010 సంవత్సరం లో మొదటి లావాదేవీ జరిగింది- 10000 Bitcoins ఉపయోగించి రెండు పిజ్జాలు కొనుగోలు చేయటం జరిగింది .దాని విలువ ఇప్పుడు దాదాపు 10 వేల కోట్ల రూపాయలు . Satoshi Nakamoto 2010 లో అదృశ్యమయ్యాడు .
2.Blockchain ఎలా పనిచేస్తుంది ?

బిట్ కాయిన్ ఎలా పనిచేస్తుంది ? అనేక Block లను ఒకదానితో మరొకటి అమర్చటాన్ని Blockchain అంటారు . Block లలో అప్పటి వరకు జరిగిన లావాదేవీల సమాచారం మొత్తం రికార్డు చేస్తారు. ప్రతి 10 నిముషాలకు ఒక కొత్త Block రిలీజ్ అవుతుంది- దానిని Mining చేసి Blockchain కు add చేస్తారు. ఈ Blockchain లో ఉన్న సమాచారం అంత పబ్లిక్ కి అందుబాటులో ఉంటుంది. ప్రతి లావాదేవిని ప్రైవేట్ కీ తో డిజిటల్ సంతకం చేయడం ద్వారా వేరొక వ్యక్తికి పంపటం జరుగుతుంది. Miners ఈ లావాదేవీలను ధృవీకరించి Block లో రికార్డు చేస్తారు . దీనినే (PoW) ప్రూఫ్ అఫ్ వర్క్ Bitcoins Mining అంటారు .ఒక పజిల్ ని పరిష్కరించి Block ని Blockchain లో చేర్చడం చేస్తే , వాళ్ళకి నూతన Bitcoins రివార్డ్ రూపంలో రావటం జరుగుతుంది .

3.Bitcoin Mining అంటే ఏమిటి ?
బిట్ కాయిన్ ఎలా తయారు చేయాలి? ఇక్కడ Mining అంటే సాధారణంగా భూమిని తవ్వి ఖనిజాలను వెలికితీయటం కాదు . Mining అంటే Powerful Computers ని ఉపయోగించి పజిల్ ని పరిష్కరించి Transactions ని Blockchain లో చేర్చడం ద్వారా కొత్త Bitcoins ని సృష్టించటం .ఒక Block ని Blockchain లో Add చేయటం ద్వారా ప్రస్తుతం 3.125 Bitcoins Block Reward గా వస్తుంది .Blockchain మొదలైన సమయంలో 50 Bitcoins Block Reward గా వచ్చేది. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి Halving జరిగి Reward సగానికి పడిపోతుంది .Bitcoin మైనింగ్ కోసం చాలా ఎక్కువ Computing Process Power ఉన్న పెద్ద కంప్యూటర్స్ కావాలి .దీనికోసమే కంప్యూటర్స్ ని నిర్మించటం జరిగింది వాటిని Specialized ASIC (Application-Specific Integrated Circuit) అంటారు .ఇవి చాలా ఖరీదుతో కూడుకున్నవి. రెండు నుండి 10 లక్షల వరకు ఖరీదు ఉంటుంది .ఇవి చాలా ఎక్కువ Power ని ఉపయోగించటం జరుగుతుంది .
What is Bitcoin in Telugu

4.Bitcoin Halving అంటే ఏమిటి ?
Bitcoin halving అంటే Blockchain మొదలైన సమయంలో Miners కి 50 Bitcoins Block Reward గా వచ్చేది. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి Halving జరిగి Reward సగానికి పడిపోతుంది .సింపుల్ భాషలో చెప్పాలి అంటే ఇలా Block Reward సగానికి పడిపోవడాన్నే Halving అంటారు .మొదట్లో 50 Bitcoins గా ఉన్న Block Reward ఇప్పుడు 3.125 .
| Year | Block Reward |
| 2009 | 50 |
| 2012 | 25 |
| 2016 | 12.5 |
| 2020 | 6.25 |
| 2024 | 3.125 (Present) |

5.Blockchain Node అంటే ఏమిటి ?
Blockchain Node అంటే బిట్ కాయిన్ నెట్వర్క్ లో పనిచేసే ఇది ఒక కంప్యూటర్ లేదా ఒక సర్వర్. transactions ని check చేసి, valid అయితేనే network లోకి పంపిస్తుంది .
సింపుల్ గా చెప్పాలంటే
- ఫేక్ ట్రాన్సాక్షన్స్ ని అరికట్టటానికి
- డబుల్ స్పెండింగ్ అవ్వకుండా చూడటానికి
- నెట్వర్క్ లో డేటాను మోడిఫై చేయకుండా ఆపటానికి
- నెట్వర్క్ ను ఢీ సెంట్రలైజ్డ్ గా ఉంచడానికి

6.Bitcoin ఎందుకు ప్రత్యేకం ?
What is Bitcoin in Telugu : Bitcoin అనేది ఒక Decentralized Cryptocurrency .ఇది ఎవరి ఆధీనంలో ఉండదు కావున దీనిని ఎవరు నియంత్రించరు.ఇది చాలా పారదర్శకంగా ఉంటుంది మరియు అన్ని లావాదేవీలు పబ్లిక్ ledger అయినటువంటి Blockchain లో record అయి ఉంటాయి.ఇది చాలా సురక్షితం అయినటువంటి ఒక వ్యవస్థ , వేగవంతము మరియు అంతర్జాతీయంగా చాలా తక్కువ ఫీజు తో ఎక్కడికి అయినా పంపవచ్చు .దీనికి బ్యాంకు వలె నిర్దిష్ట సమయం అంటూ ఉండదు కావున ఇది ఎల్లవేళలా అనగా 365 రోజులు , 24 గంటలు పనిచేస్తుంది .ఇందులో సాధారణ కరెన్సీ వలె ఎంత అయినా ప్రింట్ చేసుకునే వెసులుబాటు ఉండదు అందువల్ల కేవలం 2 కోట్ల 10 లక్షలు బిట్ కాయిన్లు మాత్రమే ఉంటాయి .ఈ ప్రత్యేకతల వల్ల ఇది “Digital Gold ” గా పిలువబడుతుంది .
What is Bitcoin in Telugu
7.Bitcoin ప్రయోజనాలు:
బిట్ కాయిన్ ఎందుకు కొనాలి?
- చాలా తక్కువ ఖర్చు ,చాలా వేగవంతమైన లావాదేవీలు.
- ప్రైవసీకు భంగం కలగదు ,దీనికి సరిహద్దులు లేవు .
- Bitcoin supply fixed కావున inflation ప్రభావం తక్కువగా ఉంటుంది
- గవర్నమెంట్ లేదా బ్యాంకు లాగా మీ Money Hold చేయటం గాని, కంట్రోల్ చేయటం గాని జరగదు .
- Middle Men ఎవ్వరు ఉండరు .Peer-to-Peer Transactions జరుగుతాయి .
8.Bitcoin లోపాలు
- Government నియంత్రణ ఉండదు కావున ధరలు హెచ్చుతగ్గులు అవుతాయి .
- Mining కోసం చాలా ఎక్కువ కరెంట్ ఖర్చు చేయాలి కావున పర్యావరణానికి హానికరం .
- నియంత్రణ లేకపోవటం Privacy వల్ల నేరస్తులు ఎక్కువ ఉపయోగించటం జరుగుతుంది.
- ధరల నియంత్రణ ఉండదు కావున ధరలు విపరీతంగా హెచ్చు తగ్గులు జరుగుతాయి .
9.Bitcoin భవిష్యత్తు
Bitcoin భవిష్యత్తు చాలా ఆసక్తికరంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది దీనిని డిజిటల్ గోల్డ్‌గా చూస్తున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థకు వెలుపల కూడా వేగంగా, సురక్షితంగా లావాదేవీలు చేయగల సామర్థ్యం Bitcoinకు పెద్ద బలం. కొన్ని దేశాల్లో దీన్ని చట్టబద్ధంగా గుర్తించడం, పెద్ద కంపెనీలు మరియు పెట్టుబడిదారులు ఆసక్తి చూపడం వల్ల దీని ఉపయోగం మరింత పెరుగుతోంది. అయితే ధరల్లో భారీ ఊగిసలాట, నియంత్రణల మార్పులు, మరియు సైబర్ రిస్క్‌లు కూడా ఉన్నాయి. అయినప్పటికీ, దీర్ఘకాలంలో Bitcoin ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన డిజిటల్ ఆస్తిగా ఎదిగే అవకాశం ఉంది.
FAQ
1. ఎవరు ఎక్కువ bitcoin కలిగి ఉన్నారు?
Ans. ఒక అంచనా ప్రకారం Bitcoin సృష్టికర్త అయిన సంతోషి నకమోటో నే ఎక్కువ బిట్ కాయిన్ లు కలిగి ఉన్నారు.
2. బిట్ కాయిన్ ఎలా కొనాలి?
Ans. మనదేశంలో బిట్‌కాయిన్ లు కొనడానికి చాలా ఎక్స్చేంజీలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి Binance , wazirX, CoinSwitch ఈ ఎక్స్చేంజి లలో అకౌంట్ చేసుకొని వివిధ పేమెంట్ మెథడ్ లో ద్వారా బిట్ కాయలు కొనవచ్చు.
3. బిట్ కాయిన్ ని కొనాలంటే పూర్తి బిట్ కాయిన్ కొనాలా లేక కొంత భాగాన్ని అయినా కొనవచ్చా?
Ans. ఒక బిట్ కాయిన్ 10 కోట్ల Satoshi’s సమానం అంటే 1 Bitcoin = 100000000 Satoshi’s. అంటే మీరు 1 Lack Satoshi’s కొన్నారనుకోండి .అప్పుడు మీ దగ్గర 0.001 బిట్ కాయిన్ ఉన్నట్టు . ఇలాగ 100 Satoshi’s అనగా 0.000001 బిట్ కాయిన్ అయినా కొనవచ్చు.
4. 2009లో బిట్ కాయిన్ లో 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇప్పుడు ఎంత అమౌంట్ వస్తుంది?
Ans. 2009లో ఒక బిట్ కాయిన్ Price 5 పైసలు ఇప్పుడు 2026 లో ఒక బిట్ కాయిన్ Price 51 లక్షలు. అంటే 2009లో వెయ్యి రూపాయలు పెట్టి బిట్ కాయిన్ కొన్నట్లయితే 20 వేల బిట్ కాయిన్ లు వచ్చేవి ఇప్పుడు వాటి విలువ 102 కోట్లు .
మరింత సమాచారం కోసం ఈ Crypto Badi ని ఫాలో అవ్వండి.

